R value: కంగారు పెట్టించి, తగ్గిన ఆర్‌ ఫ్యాక్టర్..! - telugu news r value drops below 1 in mid september
close
Updated : 22/09/2021 11:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

R value: కంగారు పెట్టించి, తగ్గిన ఆర్‌ ఫ్యాక్టర్..!

సెప్టెంబర్ నెల మధ్యలో ఒకటి కంటే తక్కువగా..

దిల్లీ: కరోనా సంక్రమణ రేటును సూచించే ఆర్‌ ఫ్యాక్టర్‌ ఒకటి కంటే తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారు. సెప్టెంబర్ మధ్యనాటికి 0.92కు క్షీణించినట్లు చెప్పారు. ఆగస్టు నెల చివరిలో అది ఒకటి కంటే ఎక్కువగా నమోదై కలవరపెట్టిన సంగతి తెలిసిందే. కరోనా సోకిన వ్యక్తి నుంచి ఎంతమందికి వైరస్ వ్యాప్తి చెందుతుందనే దానిపై ఆర్‌ వ్యాల్యూ ఆధారపడి ఉంటుంది. ఒక వైరస్ పాజిటివ్ వ్యక్తి నుంచి మరొకరికి వ్యాప్తి చెందితే ఆ విలువ ఒకటిగా ఉన్నట్లు లెక్కిస్తారు.

దేశవ్యాప్తంగా కరోనా కొత్త కేసుల పరంగా కేరళ, మహారాష్ట్ర ముందువరుసలో ఉన్నాయి. అయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఆర్‌ ఫ్యాక్టర్ ఒకటి కంటే తక్కువగా ఉండటం ఊరటనిస్తోంది. దిల్లీ, పుణె నగరాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రధాన నగరాలైన ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరులో మాత్రం ఈ విలువ ఒకటి కంటే ఎక్కువగా ఉందని పరిశోధకులు తెలిపారు. చెన్నైలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ మేథమెటికల్ సైన్సెస్‌కు చెందిన సితభ్రా సిన్హా ఆర్‌ వ్యాల్యూ లెక్కించే బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. ఆ బృందం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆర్‌ వ్యాల్యూ ముంబయిలో 1.09, చెన్నైలో 1.11, కోల్‌కతాలో 1.04, బెంగళూరులో 1.06 గా ఉంది. ఈ నెలలో 4-7వ తేదీ మధ్యలో 0.94, 11-15 మధ్యలో 0.86, 14-19 మధ్యలో 0.92గా ఉన్నట్లు పేర్కొంది. 

రెండో వేవ్ సమయంలో దేశంలో కరోనా వైరస్ విజృంభించింది. లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో ఆర్‌ ఫ్యాక్టర్ ఆందోళన కలిగించింది. ఆ తర్వాత నెలల్లో అది తగ్గుముఖం పట్టింది. మళ్లీ ఆగస్టు నెలలో కొంచెం కంగారు పెట్టినా.. సెప్టెంబరు మధ్యనాటికి ఒకటి దిగువకు చేరింది. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని