Peddanna: పవర్‌ఫుల్‌ సాంగ్‌తో సందడి చేస్తోన్న రజనీకాంత్‌  - telugu news raa saami song from peddanna rajinikanth
close
Published : 29/10/2021 02:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Peddanna: పవర్‌ఫుల్‌ సాంగ్‌తో సందడి చేస్తోన్న రజనీకాంత్‌ 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు రజనీకాంత్‌ హీరోగా దర్శకుడు శివ రూపొందించిన చిత్రం ‘అన్నాత్తే’. తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో విడుదలకానుంది. దీపావళి కానుకగా నవంబరు 4న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా ‘రా సామీ’ అంటూ సాగే పవర్‌ఫుల్‌ సాంగ్‌ (లిరికల్‌ వీడియో)ను చిత్ర బృందం విడుదల చేసింది. కాసర్ల శ్యామ్‌ రచించిన ఈ గీతానికి డి. ఇమ్మాన్‌ స్వరాలు సమకూర్చారు. ముకేశ్‌ ఆలపించారు. ఈ వీడియోలో రజనీకాంత్‌ మాస్‌ లుక్‌లో దర్శనమిచ్చారు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో రజనీకాంత్‌ పంచాయతీ ప్రెసిడెంట్‌ వీరన్నగా నటించారు. ఆయన సోదరిగా కీర్తి సురేశ్‌ కనిపించనుంది. రజనీకాంత్‌ సరసన నయనతార సందడి చేయనుంది. ఖుష్బూ, మీనా, జగపతి బాబు, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రలు పోషించారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని