Radheshyam: డేట్‌ గుర్తుపెట్టుకోండి.. టీజర్‌ వచ్చేస్తోంది - telugu news radheshyam teaser date announcement
close
Updated : 20/10/2021 13:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Radheshyam: డేట్‌ గుర్తుపెట్టుకోండి.. టీజర్‌ వచ్చేస్తోంది

హైదరాబాద్‌: పాన్‌ఇండియా స్టార్‌ ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తోన్న పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే యువకుడి పాత్రలో కనిపించనున్నారు. ఆయనకు జోడీగా నటి పూజాహెగ్డే సందడి చేయనున్నారు. ‘బీట్స్‌ ఆఫ్‌ రాధేశ్యామ్‌’, ‘గ్లిమ్స్‌ ఆఫ్‌ రాధేశ్యామ్‌’, కొన్ని ప్రచార చిత్రాలు మినహాయించి ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్‌లు బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో ‘రాధేశ్యామ్‌’ టీజర్‌ రిలీజ్‌ డేట్‌ని బుధవారం ఉదయం చిత్రబృందం ప్రకటించింది. ప్రభాస్‌ పుట్టినరోజు కానుకగా అక్టోబర్‌ 23న ఉదయం 11.16 గంటలకు ఈ సినిమా టీజర్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్‌ యంగ్‌ లుక్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ చాలావరకూ ఇటలీలోనే జరిగింది. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. చాలా సంవత్సరాల గ్యాప్‌ తర్వాత భాగ్యశ్రీ ఈ సినిమాతో తెలుగు తెరపై సందడి చేయనున్నారు. మురళీ శర్మ, ప్రియదర్శి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 14న ‘రాధేశ్యామ్‌’ విడుదల కానుంది.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని