Raghurama: జీతాలివ్వలేని స్థితికి వచ్చారు - telugu-news-raghurama letter to central home minister amit shah
close
Updated : 18/07/2021 15:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Raghurama: జీతాలివ్వలేని స్థితికి వచ్చారు

ఏపీ ఆర్థిక పరిస్థితిపై అమిత్‌షాకు లేఖ

దిల్లీ: నీటి వివాదం లాగే మూడు రాజధానుల అంశాన్నీ కేంద్రమే పరిష్కరించాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మూడు రాజధానులు, ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు రఘురామ లేఖ రాశారు. పార్లమెంట్‌ ఆమోదించిన చట్టానికి అసెంబ్లీలో సవరణ కుదరదని.. మూడు రాజధానులపై పార్లమెంట్‌లోనే చట్ట సవరణ చేయాల్సి ఉంటుందని రఘురామ లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించే ఏపీ హైకోర్టు స్టే ఇచ్చిందని భావిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రం ఇప్పటికే ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితికి వచ్చిందన్నారు. నెలలో 15వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నారన్నారు. గతంలో ఎప్పుడూ లేని ఆర్థిక స్థితి ప్రస్తుతం ఏపీలో ఉందని అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని