రాజ రాజు వచ్చాడు.. శ్రోతల్ని అలరిస్తున్నాడు - telugu news raja raju vache song from raja raja chora
close
Updated : 29/07/2021 04:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాజ రాజు వచ్చాడు.. శ్రోతల్ని అలరిస్తున్నాడు

ఇంటర్నెట్‌ డెస్క్‌: శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రాజ రాజ చోర’. హసిత్‌ గోలి దర్శకత్వం వహిస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా చెప్పుకునే ఓ దొంగ కథని ఈ చిత్రంలో చూపించనున్నారు. ఈ సినిమాలోని ‘రాజ రాజు వచ్చే’ అనే లిరికల్‌ వీడియోను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. చిత్రీకరణ సన్నివేశాలతో రూపొందించిన ఈ వీడియో అందరినీ  ఆకట్టుకునేలా ఉంది. సాధారణ స్వరాలకి భిన్నంగా సాగుతూ ఆద్యంతం అలరిస్తోంది. కథానాయకుడి పాత్ర ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ పాటని హసిత్‌ గోలి రచించారు. మోహన భోగరాజు ఆలపించారు. రోహిత్‌ పరిటాల, సాయి చరణ్‌, ధనుంజయ్‌, లోకేశ్వర్‌, సాయి స్మరణ్‌ కోరస్‌ అందించారు. వివేక్‌ సాగర్‌ స్వరాలు సమకూర్చారు. శ్రీ విష్ణు సరసన మేఘా ఆకాశ్‌, సునైన నటిస్తున్నారు. రవిబాబు, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని టీజీ విశ్వ ప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు. త్వరలోనే థియేటర్లలో విడుదల కానుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని