రాజస్థాన్‌ రాయల్స్‌కు ఊహించని పరిణామం.. ఐపీఎల్‌కు జోస్‌ బట్లర్‌ దూరం - telugu news rajasthan royals says jos buttler is out of remainder ipl this season
close
Published : 21/08/2021 22:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాజస్థాన్‌ రాయల్స్‌కు ఊహించని పరిణామం.. ఐపీఎల్‌కు జోస్‌ బట్లర్‌ దూరం

ఇంటర్నెట్‌డెస్క్‌: వచ్చేనెల జరిగే ఐపీఎల్‌ 2021 మిగతా సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ మిగతా సీజన్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టే ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంది. బట్లర్‌ సతీమణి లూయిస్‌ త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారని, అందుకోసమే అతడు మిగిలిన సీజన్‌కు అందుబాటులో ఉండటం లేదని ఆ జట్టు స్పష్టం చేసింది.

భారత్‌లో నిర్వహించిన టోర్నీలో పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో ఐపీఎల్‌ మే 4న అర్ధాంతరంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. బీసీసీఐ, ఐపీఎల్‌ నిర్వాహకులు మిగతా సీజన్‌ను సెప్టెంబర్‌ 19 నుంచి యూఏఈలో తిరిగి నిర్వహించాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పలు జట్ల ఆటగాళ్లు అక్కడికి చేరుకొని ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. రాజస్థాన్‌ ఆటగాళ్లు కూడా త్వరలోనే అక్కడికి వెళ్లనున్నారు. ఇంతలోనే బట్లర్‌ దూరమయ్యాడని ఆ జట్టు ప్రకటించింది. ఇక ఈ సీజన్‌ మధ్యలో నిలిచిపోయేసరికి ఆ జట్టు ఏడు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, నాలుగు ఓటములతో ఐదో స్థానంలో నిలిచింది. ఇకపై మెరుగైన ప్రదర్శన చేస్తే ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశం లేకపోలేదు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని