Jyotika: హత్తుకునేలా ‘రక్త సంబంధం’.. జ్యోతిక 50వ చిత్రం ట్రైలర్‌ చూశారా! - telugu news raktha sambandham jyotika
close
Published : 04/10/2021 22:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Jyotika: హత్తుకునేలా ‘రక్త సంబంధం’.. జ్యోతిక 50వ చిత్రం ట్రైలర్‌ చూశారా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: జ్యోతిక, శశి కుమార్‌, సముద్రఖని ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘రక్త సంబంధం’. శర్వణన్‌ దర్శకుడు. ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ నెల 14 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్‌ని విడుదల చేసింది. బంధాలు, అనుబంధాల నేపథ్యంలో సాగే ఈ ట్రైలర్‌ ప్రతి ఒక్కరినీ హత్తుకునేలా ఉంది. జ్యోతిక అన్నయ్యగా శశికుమార్‌, భర్తగా సముద్రఖని కనిపించారు. ముగ్గురి నటన ఆకట్టుకుంటుంది. ఎంతో ఆప్యాయంగా ఉండే శశి, సముద్రఖని ఒకానొక సందర్భంలో మాటకిమాట అనుకుంటారు. ఈ సీన్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. వీరి మధ్య మనస్పర్థలు రావడానికి కారణమేంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సూర్య 2డీ ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి డి. ఇమ్మాన్‌ సంగీతం అందించారు. జ్యోతిక నటించిన 50వ చిత్రమిది.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని