Tollywood Drugs Case: విచారణకు సమయం కోరిన రకుల్‌ - telugu news rakul preet singh seeks more time from ed
close
Published : 02/09/2021 15:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tollywood Drugs Case: విచారణకు సమయం కోరిన రకుల్‌

హైదరాబాద్‌: టాలీవుడ్‌ మాదకద్రవ్యాల కేసు విచారణకు కొంత గడువు కావాలని నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కోరారు. కేసు విచారణలో భాగంగా ఈ నెల 6న ఆమె ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్) ఎదుట హాజరు కావాల్సి ఉంది. కాగా, వరుస షూటింగ్స్‌తో ఫుల్‌ బిజీగా ఉండటంచేత తాను ఇప్పుడే విచారణకు హాజరు కాలేనని.. కొంత గడువు ఇవ్వాలని ఆమె ఈడీని కోరారు. దీంతో మరికొన్నిరోజుల్లో జరగనున్న ఈడీ విచారణకు రకుల్‌ హాజరు అవుతారా? లేదా? అనే దానిపై సందిగ్ధత నెలకొని ఉంది.

సుమారు నాలుగేళ్ల క్రితం టాలీవుడ్‌లో మాదకద్రవ్యాల వ్యవహరం వెలుగులోకి రావడంతో దీనితో సంబంధమున్న వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖుల్ని సుదీర్ఘంగా విచారించిన ఎక్సైజ్‌ అధికారులు వాళ్లందరికీ క్లీన్‌చీట్‌ ఇచ్చారు. కాగా, తాజాగా డ్రగ్స్‌ కేసును టేకప్‌ చేసిన ఈడీ అధికారులు మనీ లాండరింగ్‌ చట్టం కింద 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఆగస్టు 31న పూరీ జగన్నాథ్‌.. సెప్టెంబర్‌ 2న ఛార్మి ఈడీ ఎదుట హాజరయ్యారు. ఇక.. 6న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, 8న రానా దగ్గుబాటి, 9న రవితేజ, శ్రీనివాస్‌, 13న నవదీప్‌తోపాటు ఎఫ్‌ క్లబ్‌ మేనేజర్‌, 15న ముమైత్‌ ఖాన్‌, 17న తనీశ్‌, 20న నందు, 22వ తేదీన తరుణ్‌ ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని