RamCharan: 25 భాషల్లో చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ వెబ్‌సైట్‌ - telugu news ramcharan launched chiranjeevi charitable trust wedsite
close
Updated : 18/10/2021 16:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RamCharan: 25 భాషల్లో చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ వెబ్‌సైట్‌

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి స్థాపించిన ‘చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌’ మరో ముందడుగు వేసింది. ఇకపై ఈ ట్రస్ట్‌ సేవలు ఆన్‌లైన్‌లోనూ అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు ట్రస్ట్‌ వెబ్‌సైట్‌ను సోమవారం ఉదయం చిరు తనయుడు రామ్‌ చరణ్‌ ఆవిష్కరించారు. మరిన్ని ప్రాంతాలకు, మరెంతో మందికి చిరు బ్లడ్‌, ఐ బ్యాంక్‌ సేవలు అందుబాటులోకి తీసుకురావడం కోసమే ఈ వెబ్‌సైట్‌ ప్రారంభించినట్లు తెలిపారు. దాదాపు 25 భాషల్లో ఇది అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఎన్నో సంవత్సరాల నుంచి సేవలు కొనసాగించడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.

చిరంజీవి కెరీర్‌, సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. స్టార్‌గా ఎదిగే క్రమంలో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలియజేసేలా ‘కె.చిరంజీవి’ పేరుతో మరో వెబ్‌సైట్‌ని చరణ్‌ ప్రాంభించారు. చిరంజీవి జీవితం, ఆయన నటించిన సినిమాలు, పాటలు, దర్శకనిర్మాతలతో ఆయనకున్న సత్సబంధాల గురించి ఈ వెబ్‌సైట్‌లో సమాచారం ఉంచామని చరణ్‌ వివరించారు. మరోవైపు తమ అభిమాన నటుడు రామ్‌చరణ్‌ని చూసేందుకు ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని