Raashikhanna: ప్రియుడు గురించి చెప్పాలంటే.. కొంత టైమ్‌ ఆగాలి..! - telugu news rashikhanna latest chat with fans
close
Published : 07/10/2021 01:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Raashikhanna: ప్రియుడు గురించి చెప్పాలంటే.. కొంత టైమ్‌ ఆగాలి..!

అభిమానులతో చాట్‌ చేసిన నటి రాశీఖన్నా

హైదరాబాద్‌: దక్షిణాదిలో వరుస ప్రాజెక్ట్‌లు చేస్తూ కథానాయకగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు నటి రాశీఖన్నా. ప్రస్తుతం మలయాళంలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ సరసన నటిస్తున్న ఆమె తాజాగా ఇన్‌స్టా వేదికగా అభిమానులతో చిట్‌చాట్‌ చేశారు. ఇందులో భాగంగా తన ఇష్టాయిష్టాలను బయటపెట్టారు. ఇంతకీ రాశీఖన్నా చెప్పిన విశేషాలేమిటంటే..

మీ ఫోన్‌ వాల్‌పేపర్‌ ఏమిటి?

నా గురువుగారితో దిగిన ఓ ఫొటోని వాల్‌పిక్‌గా పెట్టుకున్నాను.

మీ బాయ్‌ఫ్రెండ్‌ పేరు చెప్పగలరు?

ఇంకా నా జీవితంలోకి బాయ్‌ఫ్రెండ్ రాలేదు. ఒకవేళ నేను ఎవరినైనా ఇష్టపడితే తప్పకుండా మీ అందరికీ చెబుతాను. కాబట్టి ఇంకొంతకాలం ఆగండి.

మీకిష్టమైన సినిమా ఏమిటి?

ది ప్రపొజల్‌.

మీరు ఇష్టంగా తినే ఆహారం?

నేను ఫుడీ కాదు. అలాగే, శాకాహారిని. నా గురించి బాగా తెలిసిన వాళ్లకు మాత్రమే ఈ విషయం తెలుసు. ఇక, ఇష్టమైన ఆహారమంటే.. థాయ్‌ గ్రీన్‌ కర్రీ, ఛోలే బటురే, సమోసా.

కోలీవుడ్‌లో మీరు అభిమానించే నటీనటులు?

విజయ్‌, నయనతార

దక్షిణాదిలో వరుస సినిమాలు చేస్తున్నారు. ఇంతకీ, మీ మాతృభాష ఏమిటి? మీరు ఎన్ని భాషలు మాట్లాడగలరు?

హిందీ. 5 భాషలు బాగా మాట్లాడగలను.

మలయాళంలో మీకు నచ్చిన చిత్రమేది? నటుడు ఎవరు?

చాలా పెద్ద లిస్టే ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ‘కుంబలంగి నైట్స్‌’. ఫహద్‌ ఫాజిల్‌ అంటే ఇష్టం.

మీ తదుపరి చిత్రాలేమిటి?

నా చేతిలో వరుస ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. మరో రెండు రోజుల్లో అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ‘బ్రహ్మాం’ విడుదల కానుంది. 

అల్లు అర్జున్‌పై మీ అభిప్రాయం?

అల్లు అర్జున్‌ కేవలం మంచి నటుడు మాత్రమే కాదు గొప్ప డ్యాన్సర్‌ కూడా. ఆయనతో కలిసి స్క్రీన్‌ పంచుకోవడం కోసం ఆశగా ఎదురుచూస్తున్నా.

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌తో స్క్రీన్‌ పంచుకోవడం ఎలా ఉంది?

ఆయనతో కలిసి నటించడం నాకెంతో సంతోషంగా ఉంది. అందరికీ తెలుసు ఆయన అద్భుతమైన నటుడని.. ఫిల్మ్‌ మేకింగ్‌పై ఆయకున్న అభిరుచి మాటల్లో వర్ణించలేనిది. ఆయనతో మరెన్నో సినిమాల్లో నటించాలనుకుంటున్నా.

హాలీడేస్‌కి వెళ్లాలంటే ఎక్కడికి వెళ్తారు?

లండన్‌

మీ గురించి వస్తున్న వార్తలన్నీ రూమర్స్ అనే అనుకుంటున్నా?

నేను అధికారికంగా ప్రకటించేవరకూ ఏవిషయాన్ని నమ్మకండి. ఎందుకంటే అవన్నీ వదంతులు మాత్రమే నిజాలు కాదు.

విజయ్ దేవరకొండ‌తో నటించారు కదా. ఆయన గురించి ఏమైనా చెప్పండి?

ఎంతో టాలెంట్‌, శ్రమించే గుణం ఉన్న వ్యక్తి. తనతో మరలా సినిమా చేయాలని ఉంది.

టాలీవుడ్‌లో మీకు ఇష్టమైన తారలు ఎవరు?

సమంత, అనుష్క శెట్టి, జూనియర్‌ ఎన్టీఆర్‌, బన్నీ, మహేశ్‌బాబు అంటే నాకు ఇష్టం. అలాగే, వెంకటేశ్‌ అంటే నాకెంతో ఇష్టం. ఆయన చాలా బాగా మాట్లాడతారు. కలిసిపోతారు. ఆయనతో కలిసి పనిచేయడాన్ని ఎంతో మిస్‌ అవుతున్నా.

సాయిపల్లవి స్క్రీన్‌పై ఎలా ఉంటుంది?

డ్యాన్స్, నటన.. ఏదైనా సరే ఆమెను చూస్తే ఓ కలలా ఉంటుంది.

మీరింకా సింగిల్‌గానే ఎలా ఉన్నారు?

ఏమో నాకు తెలీదు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని