Rashmika Mandanna: ఆ నటి బయోపిక్‌లో నటించాలనుంది! - telugu news rashmika about biopic
close
Published : 16/09/2021 23:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Rashmika Mandanna: ఆ నటి బయోపిక్‌లో నటించాలనుంది!

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు, తమిళంతోపాటు ఇటీవలే బాలీవుడ్‌లో అడగుపెట్టి వరుస చిత్రాలు చేస్తూ బిజీ అయిపోయింది రష్మిక మందన. ఇటీవల కాలంలో బాలీవుడ్‌ నుంచి మొదలుకొని టాలీవుడ్‌ వరకు బయోపిక్‌ల హవా కొనసాగుతోంది. ఇదే విషయంపై ‘ఎవరి బయోపిక్‌లో నటించాలని ఉంది’ అని ఓ ఇంటర్వ్యూలో రష్మికి ప్రశ్న ఎదురైంది. దీంతో తన మనసులో మాట పంచుకుంది. తెలుగులో అగ్రశ్రేణి తారగా వెలుగొందిన సౌందర్య బయోపిక్‌లో నటించాలని ఉంది అని సమాధానమిచ్చింది. ‘నేను సౌందర్యలా ఉంటానని మా నాన్న అంటుండేవారు. నటిగా సౌందర్య ఎంతో కష్టపడ్డారు. ఆమె ఎన్నో వైవిధ్య పాత్రల్ని పోషించారు. నాకు ఆమె బయోపిక్‌లో నటించాలని ఉంది’ అని రష్మిక తెలిపింది. రష్మిక త్వరలోనే ‘మిషన్‌ మజ్ను’ చిత్రంతో హిందీ ప్రేక్షకుల్ని నేరుగా పలకరించనుంది. ప్రస్తుతం రష్మిక తెలుగులో ‘పుష్ప’, ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’, హిందీలో ‘గుడ్‌ బై’ చిత్రాలతో బిజీగా ఉంది. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని