Tokyo olympics: ఆట, అదృష్టం కలిసొస్తే రెజ్లింగ్‌లో పతకాలు ఖాయం! - telugu news ravi and deepak get good draw european champion awaits anshu malik in her 57kg opener
close
Updated : 03/08/2021 15:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tokyo olympics: ఆట, అదృష్టం కలిసొస్తే రెజ్లింగ్‌లో పతకాలు ఖాయం!

రవి దహియా, దీపక్‌ పునియాకు సులభ డ్రా

టోక్యో: భారత కుస్తీవీరులకు టోక్యో ఒలింపిక్స్‌లో సులభ డ్రాలే ఎదురయ్యాయి. ఆట, అదృష్టం కలిసొస్తే వారు పతకాలు గెలిచే అవకాశం కనిపిస్తోంది. రెజ్లర్లు దీపక్‌ పునియా (86 కిలోలు), రవి దహియా (57 కిలోలు), అన్షు మలిక్‌ (57 కిలోలు) మంగళవారం బరిలోకి దిగనున్నారు.

రవి దహియా తన తొలిపోరులో కొలంబియాకు చెందిన టైగ్రెరోస్‌ అర్బనోస్‌తో తలపడనున్నాడు. ఫామ్‌ ప్రకారం చూస్తే అతడిపై విజయం సులభమేనని తెలుస్తోంది. అంతేకాదు అతడికి సెమీస్‌ వరకు తిరుగులేదని విశ్లేషకులు అంటున్నారు. ఆరంభ పోరులో రవి గెలిస్తే తర్వాత అల్జీరియాకు చెందిన అబ్దుల్‌హక్‌ ఖరబచె లేదా జార్జి వాలెంటినోవ్‌ (బల్గేరియా)తో తలపడాల్సి ఉంటుంది. అందులో గెలిస్తే.. సెమీస్‌లో సెర్బియా టాప్‌ సీడ్‌ స్టీవెన్‌ ఆండ్రియా మైకిక్‌ లేదా జపాన్‌ రెజ్లర్‌ యుకి టకాహషిలో ఒకరితో పోరు ఉంటుందని అంచనా. 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రవి కాంస్యం గెలిచాడు. ప్రస్తుతం అతడు ఆసియా విజేతగా కొనసాగుతున్నాడు.

ఇక 86  కిలోల విభాగంలో దీపక్‌ పునియా నైజీరియా రెజ్లర్‌ ఎకిరెకెమె అజియోమర్‌తో తొలిపోరులో తలపడనున్నాడు. అతడిపై విజయం సాధిస్తే జుషెన్‌ లిన్‌ (చైనా) లేదా ఎడిన్‌సన్‌ అంబ్రోసియో గ్రిఫో (పెరు)తో రెండో పోరు ఉంటుంది. మరోవైపు 19 ఏళ్ల యువ క్రీడాకారిణి అన్షు మలిక్‌కు కఠిన డ్రా ఎదురైంది. ఐరోపా ఛాంపియన్‌ ఇరినా కురుచికినాతో తలపడాల్సి ఉంటుంది. అందులో గెలిస్తే రియో ఒలింపిక్స్‌ రజత పతక విజేత వలెరియా కాబ్లొవా లేదా మెక్సికో రెజ్లర్‌ అల్మా జేన్‌తో మ్యాచ్‌ ఉంటుంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని