Bollywood: క్రిస్మస్‌కి కపిల్ దేవ్‌ బయోపిక్‌.. ప్రేమికులరోజున ‘లాల్‌సింగ్‌ చద్దా’ - telugu news release dates of ranveer singh aamir khan naga chaitanya movies
close
Published : 26/09/2021 22:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bollywood: క్రిస్మస్‌కి కపిల్ దేవ్‌ బయోపిక్‌.. ప్రేమికులరోజున ‘లాల్‌సింగ్‌ చద్దా’

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత థియేటర్లలో విడుదలైన హిందీ చిత్రాల సంఖ్య తక్కువనే చెప్పాలి. మహారాష్ట్రలో పూర్తిస్థాయిలో థియేటర్లు తెరచుకోకపోవడమే ఇందుకు కారణం. థియేటర్లను వందశాతం తెరవాలని చిత్రసీమ నుంచి ఎందరో ప్రముఖులు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం స్పందించి, అక్టోబరు 22 నుంచి థియేటర్లును తెరచేందుకు అనుమతినిచ్చింది. దాంతో అగ్ర హీరోలు తమ చిత్రాల విడుదల తేదీని ప్రకటించేస్తున్నారు. ఇప్పటికే తాను నటించిన ‘సూర్యవంశీ’ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్టు అక్షయ్‌ కుమార్‌ తెలిపారు. తాజాగా రణ్‌వీర్‌ సింగ్‌, ఆమీర్ ఖాన్‌ తమ తమ సినిమాల్ని ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు తీసుకొస్తున్నారో చెప్పారు.

‘83’.. క్రిస్మస్‌కి

టీమిండియా మాజీ సారథి కపిల్‌ దేవ్‌ జీవితాధారంగా రూపొందుతోన్న చిత్రం ‘83’. కపిల్‌ దేవ్‌గా రణ్‌వీర్‌ నటించారు. కపిల్‌ భార్య పాత్రలో దీపికా కనిపించనున్నారు. కబీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా క్రిస్మస్‌ కానుకగా విడుదలకానుంది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ప్రేక్షకుల్ని అలరించనుంది.

‘లాల్‌సింగ్‌ చద్దా’.. వచ్చే ఏడాదికి

ఆమీర్‌ ఖాన్‌, నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న హిందీ చిత్రం ‘లాల్‌సింగ్‌ చద్దా’. అద్వైత్‌ చందన్‌ దర్శకుడు. కరీనా కపూర్‌ కథానాయిక. వచ్చే ఏడాది ప్రేమికుల రోజున ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని 2021 క్రిస్మస్‌కి విడుదల చేయలేకపోతున్నామని తెలిపింది.

వీటితో పాటు మరికొన్ని సినిమాల విడుదల తేదీలు సైతం ఖరారయ్యాయి

* తడప్‌- డిసెంబరు 3, 2021

* బచన్‌ పాండే- మార్చి 4, 2022

* హీరో పంటి2- మే 6,2022



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని