HYD: మణికొండలో గల్లంతైన వ్యక్తి కోసం కొనసాగుతున్న గాలింపు - telugu news rescue operation continious in manikonda for a person
close
Updated : 26/09/2021 09:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

HYD: మణికొండలో గల్లంతైన వ్యక్తి కోసం కొనసాగుతున్న గాలింపు

హైదరాబాద్‌: నగరంలో నిన్న రాత్రి పలు చోట్ల కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మణికొండలో ఓ వ్యక్తి డ్రైనేజీ పైపులైన్‌ కోసం తవ్విన గుంతలో పడి గల్లంతయ్యాడు. అతడి కోసం 10 గంటలుగా అధికారులు గాలిస్తున్నారు. డీఆర్‌ఎఫ్‌ బృందాలు రాత్రే రంగంలోకి దిగి గాలింపు చేపట్టిన విషయం తెలిసిందే. తూములు వెళ్లి కలిసే చోట కూడా ఆ వ్యక్తి కోసం చర్యలు చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నెక్నాంపూర్ చెరువు వద్ద మరో బృందం గాలిస్తోంది. నీటి ప్రవాహం ఎక్కువ ఉండటంతో అతడు చెరువు వరకూ వెళ్లే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని