Telangana politics: శ్రేణులపై వేధింపులు ఆపకపోతే బుద్ధి చెబుతాం: రేవంత్‌రెడ్డి - telugu-news-revanth reddy fires on trs over munugodu issue
close
Published : 29/07/2021 01:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Telangana politics: శ్రేణులపై వేధింపులు ఆపకపోతే బుద్ధి చెబుతాం: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని.. ప్రజాస్వామ్యం నిలువునా ఖూనీ అవుతోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్‌ కార్యకర్తలపై వేధింపులు ఆపకపోతే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనకుండా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అడ్డుకోవడం.. ఆయన హక్కులను కాలరాసినట్లేనని ధ్వజమెత్తారు. వేలాది మంది పోలీసులు, తెరాస కార్యకర్తలు కలిసి కాంగ్రెస్ శ్రేణులు సమావేశానికి రాకుండా తనిఖీ కేంద్రాలు పెట్టి అడ్డుకున్నారని ఆక్షేపించారు. ఒక ఎమ్మెల్యే అధికారికంగా చేయాల్సిన కొత్త రేషన్ కార్డుల పంపిణీని తెరాస కార్యకర్తలు, పోలీసుల సమక్షంలో మంత్రి జగదీశ్‌ రెడ్డి చేపట్టారని విమర్శించారు.

‘‘దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి మంత్రి జగదీశ్‌ రెడ్డిని అడగడం తప్పా? దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయమంటే కేసులు పెట్టి వేధిస్తారా? రాజగోపాల్ రెడ్డి దళితుల కోసమే మాట్లాడారు. మంత్రి అవినీతిలో వాటా ఏమైనా అడిగారా? ఇలాగే కేసులు పెట్టి కాంగ్రెస్ నేతలు వేధిస్తే అధికార పార్టీ కార్యక్రమాలను ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. అరెస్ట్ చేసిన కాంగ్రెస్ శ్రేణులను వెంటనే విడుదల చేయాలి’’ అని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని