Tollywood Drugs Case: ఎక్సైజ్‌శాఖ విచారణలో చాలా మందిని తప్పించారు: రేవంత్‌ - telugu news revanth reddy pressmeet on drugs case investigation
close
Published : 16/09/2021 02:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tollywood Drugs Case: ఎక్సైజ్‌శాఖ విచారణలో చాలా మందిని తప్పించారు: రేవంత్‌

హైదరాబాద్‌: డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో ఎక్సైజ్‌ శాఖ విచారణలో చాలా మందిని తప్పించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో ఎక్సైజ్‌ శాఖ తూతూ మంత్రంగా విచారణ జరిపిందని ఆయన ఆక్షేపించారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్‌ మాట్లాడారు. అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. తాను పట్టు విడవకుండా కోర్టులో పోరాటం చేసినందునే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ చేపట్టిందని.. ఈ క్రమంలోనే సినీ ప్రముఖులను విచారిస్తోందని చెప్పారు. 

బెంగళూరు, గోవా సహా దేశంలోని కొన్ని ఇతర ప్రాంతాల్లో డ్రగ్స్‌ కేసులు నమోదైతే వాటి మూలాలు హైదరాబాద్‌లో ఉంటున్నాయని రేవంత్‌ చెప్పారు. రాష్ట్రంలోని పేరున్న కార్పొరేట్‌ స్కూళ్లలోనూ డ్రగ్స్‌ అమ్మకాలు జరుగుతున్నట్లు పోలీసుల విచారణలో తేలిందన్నారు. అయినా ఈ వ్యవహారంలో విచారణ ముందుకు సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సహకరించడం లేదని రేవంత్‌ ప్రశ్నించారు. దీని వెనుకున్న రహస్యమేంటని ఆయన నిలదీశారు. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని