Revanth reddy: అమిత్ షా అపాయింట్‌మెంట్‌ ఇస్తే.. ఆధారాలతో ఫిర్యాదు చేస్తా: రేవంత్‌రెడ్డి - telugu news revanth reddy request central home ministry for amit shah appointment
close
Updated : 16/09/2021 19:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Revanth reddy: అమిత్ షా అపాయింట్‌మెంట్‌ ఇస్తే.. ఆధారాలతో ఫిర్యాదు చేస్తా: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాను కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్‌ అవినీతి, అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్‌ నాయకులకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కేంద్ర హోం శాఖకు విజ్ఞప్తి చేశారు. తనతోపాటు ముగ్గురు ఎంపీలు, ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ.. మొత్తం పది మందికి అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని రేవంత్ కోరారు. సీఎం కేసీఆర్‌ అవినీతికి పాల్పడుతున్నట్లు పూర్తి ఆధారాలతో ఇప్పటికే కేంద్రానికి నివేదించినా ప్రయోజనం లేదని ఆక్షేపించారు. ఈ నెల 17న అమిత్‌ షా తెలంగాణకు రానున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన ఏడున్నరేళ్ల కాలంలో విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులు, మైనింగ్ తదితర రంగాల్లో జరిగిన అనేక అవకతవకలపై పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేస్తామని వివరించారు. ఈ విషయంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తమకు అపాయింట్‌మెంట్ ఇప్పించాలని ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని