Road Accident: విజయవాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి - telugu news road accident in vijayawada
close
Published : 26/09/2021 01:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Road Accident: విజయవాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

విజయవాడ: కండ్రిక సమీపంలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. రహదారి నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసిన జాకీలను ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనం ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు. యువకులు కండ్రిక నుంచి పాతపాడుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. మృతులను వాంబేకాలనీ వాసులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని