Romantic: ప్రభాస్‌ ‘రొమాంటిక్‌’ సర్‌ప్రైజ్‌.. ట్రైలర్‌ అదిరింది! - telugu news romantic movie trailer released by prabhas
close
Updated : 19/10/2021 16:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Romantic: ప్రభాస్‌ ‘రొమాంటిక్‌’ సర్‌ప్రైజ్‌.. ట్రైలర్‌ అదిరింది!

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘రొమాంటిక్‌’. కేతికా శర్మ కథానాయిక. అనిల్‌ పాడూరి దర్శకుడు. ఈ చిత్రం అక్టోబరు 29న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలోనే అగ్ర కథానాయకుడు ప్రభాస్‌ ట్రైలర్‌ని విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ ‘బుజ్జిగాడు’, ‘ఏక్‌ నిరంజన్‌’ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. ట్రైలర్‌ విషయానికొస్తే.. టైటిల్‌కి తగ్గట్టుగా రొమాంటిక్‌ సన్నివేశాలతో యువతని మెప్పించేలా ఉంది. ఆకాశ్‌ తన నటనలో పరిణితి చూపించారు. తొలి పరిచయంలోనే కేతిక అందరినీ కట్టిపడేసేలా ఉంది. నేపథ్యం సంగీతం బాగుంది. ఈ ప్రేమకథా చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్‌, ఛార్మి నిర్మిస్తున్నారు. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. సునీల్‌ కశ్యప్‌ సంగీతం అందిస్తున్నారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని