Romantic: రొమాంటిక్‌ రిలీజ్‌ ఎప్పుడంటే..! - telugu news romantic release date announcement
close
Published : 25/09/2021 15:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Romantic: రొమాంటిక్‌ రిలీజ్‌ ఎప్పుడంటే..!

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ కుమారుడు ఆకాశ్‌ కథానాయకుడిగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘రొమాంటిక్‌’. కేతికా శర్మ కథానాయిక. అనిల్‌ పాడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నవంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం శనివారం అధికారికంగా ప్రకటించింది. పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రంగా సిద్ధమవుతోన్న ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్‌, ఛార్మి నిర్మిస్తున్నారు. ఇందులో రమ్యకృష్ణ కీలకపాత్రలో నటించనున్నారు. ఈ సినిమా ప్రచార చిత్రాలు.. ‘నువ్వు నేను ఈ క్షణం’ అనే పాట ఇప్పటికే ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. సునీల్‌ కశ్యప్‌ స్వరాలు అందిస్తున్నారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని