RRR: అదిరిపోయే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ థీమ్‌ సాంగ్‌.. గాయకులు వీరే - telugu news rrr movie theme song starring ntr and ram charan directed by rajamouli
close
Updated : 27/07/2021 11:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RRR: అదిరిపోయే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ థీమ్‌ సాంగ్‌.. గాయకులు వీరే

ఇంటర్నెట్‌ డెస్క్‌: యావత్‌ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌). రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా పాన్‌ ఇండియా స్థాయిలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అక్టోబరు 13న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ నేపథ్యంలో ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇందుకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌ థీమ్‌ సాంగ్‌’ పేరిట ప్రత్యేక గీతాన్ని రూపొందించారనే సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసినప్పటి నుంచే ఎవరు పాడుతున్నారా? అనే ఆసక్తి అందరిలో మొదలైంది. తాజాగా చిత్రబృందం ఈ వివరాల్ని తెలియజేస్తూ ఫొటోను విడుదల చేసింది. తెలుగు, తమిళ్‌, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం రూపొందుతుండటంతో ఒక్కో భాషలో ఒక్కో సింగర్‌తో ఈ పాటని పాడించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. హేమచంద్ర, అనిరుధ్‌ రవిచందర్‌, విజయ్‌ ఏసుదాసు, అమిత్‌ త్రివేది, యాజిన్‌ నైజర్‌ ఆలపించిన ఈ పాట ఆగస్టు 1న విడుదల కానుంది. స్నేహం విలువని చాటిచెప్పే గీతమిది.

పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీంగా ఎన్టీఆర్‌ కనిపించనున్నారు. ఆలియా భట్‌, ఒలివియా మోరీస్‌ కథానాయికలు. అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని పలువురు హాలీవుడ్‌ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని