RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీ షర్ట్‌లు చూశారా? - telugu news rrr t shirts cups masks
close
Published : 21/09/2021 23:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీ షర్ట్‌లు చూశారా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా విడుదలకు ఇంకాస్త సమయం ఉండటంతో చిత్రబృందం చరణ్‌, ఎన్టీఆర్‌ అభిమానులకు కొత్త సర్‌ప్రైజ్‌ల్ని అందిస్తోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని వీరిద్దరి పాత్రలకి సంబంధించిన లోగోలతో టీ షర్ట్‌లు, కప్పులు, మాస్కులు తదితర వస్తువుల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. సంబంధిత ఫొటోల్ని ప్రముఖ నటుడు రానా ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ‘రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌, సినిమా అభిమానులు వేడుకల్ని ప్రారంభించండి’ అని పేర్కొన్నారు.

ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌.. కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. ఆలియా భట్‌, ఒలివియా మోరిస్‌ కథానాయికలు. అజయ్‌ దేవగణ్‌, శ్రియ కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ముందుగా ఈ చిత్రాన్ని అక్టోబరు విడుదల చేయాలని భావించినా ప్రస్తుత పరిస్థితుల కారణంగా చిత్ర బృందం వాయిదా వేసింది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని