Sonu Sood: సోనూ సూద్‌, నిధి అగర్వాల్‌ జంటగా ప్రేమ గీతం - telugu news saath kya song sonu sood niddhi agerwal directed by farah khan
close
Published : 05/08/2021 15:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sonu Sood: సోనూ సూద్‌, నిధి అగర్వాల్‌ జంటగా ప్రేమ గీతం

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోనూ సూద్‌, నిధి అగర్వాల్‌ జంటగా ఓ హిందీ గీతం రూపొందుతోంది. ఫరాఖాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అన్షుల్‌ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ పాటకి సంబంధించిన టీజర్‌ని విడుదల చేశారు. సోనూ, నిధి లుక్స్‌, హావభావాలు, లొకేషన్లు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘సాత్‌ క్యా’ అంటూ సాగే ఈ గీతాన్ని స్వీయ సంగీత దర్శకత్వంలో టోనీ కక్కడ్‌ రచించారు. అల్తాఫ్‌ రాజ్‌తో కలసి టోనీ కక్కడ్‌ ఆలపించారు. ఫరాఖాన్‌ కొరియోగ్రఫీ సమకూర్చారు. పూర్తి వీడియో ఆగస్టు 9న విడుదల కానుంది. ‘ఓం శాంతి ఓం’, ‘హ్యాపీ న్యూ ఇయర్‌’, ‘మై హూనా’ తదితర చిత్రాల దర్శకురాలే ఫరాఖాన్‌. కొరియోగ్రాఫర్, నటి, నిర్మాతగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారామె. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని