Sachin Tendulkar: ఎడమచేత్తో సచిన్‌ గోల్ఫ్‌.. ఎవరు సాయం చేస్తున్నారో తెలుసా! - telugu news sachin tendulkar plays golf left-handed any guesses who helped him
close
Updated : 14/08/2021 15:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sachin Tendulkar: ఎడమచేత్తో సచిన్‌ గోల్ఫ్‌.. ఎవరు సాయం చేస్తున్నారో తెలుసా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాక చాలామంది క్రికెటర్లు చేసే పనేంటో తెలుసా? గోల్ఫ్‌ క్రీడలో శిక్షణ పొందడం.. కాలం గడిపేందుకు దానినే ఆడటం. కపిల్‌ దేవ్‌ వంటి దిగ్గజాలు ఇప్పటికే గోల్ఫ్‌లో ప్రొఫెషనల్‌ స్థాయిలో రాణిస్తున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందూల్కర్‌ సైతం గోల్ఫ్‌ ప్రేమికుడే! ఆయన అద్భుతంగా గోల్ఫ్‌ ఆడతారు. సాధారణంగా సచిన్‌ది కుడిచేతి వాటం. కానీ ఆయన ఎడమచేతితో గోల్ఫ్‌ ఆడి అలరించారు. అందుకు ఒకరు సాయం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను మాస్టర్‌ ట్వీట్‌ చేశారు.

‘గాయ్స్‌..! నేను సవ్యసాచిని (రెండు చేతులతో పనిచేసేవారు). నేడు లెఫ్ట్‌ హ్యాండర్స్‌ డే. సాధారణంగా నేను కుడిచేత్తోనే ఆడతాను. ఈ సారి మాత్రం ఎడమచేత్తో ప్రయత్నిస్తాను. మరి సరిగ్గా ఆడేందుకు నాకెవరు సాయం చేస్తున్నారో తెలుసా?’ అని సచిన్‌ అన్నాడు. అప్పుడు ‘మాస్టర్‌ బ్లాస్టర్‌ లాగే బాదేయండి’ అంటూ అప్పుడే యువరాజ్‌ సింగ్‌ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

కరోనా వైరస్‌ మహమ్మారి నేపథ్యంలో సచిన్‌ బయటకు వెళ్లడం లేదు. ఎక్కువగా ఇంటవద్దే ఉంటున్నాడు. లేదంటే తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి కాలం గడుపుతున్నాడు. ఇంట్లోవాళ్లకు వెరైటీ వంటకాలు పరిచయం చేస్తున్నాడు. మూగ జీవాలను పెంచుతున్నాడు. ఈ మధ్యే ‘స్పైక్’ అనే ఒక బుజ్జి కుక్కపిల్లను అందరికీ పరిచయం చేసిన సంగతి తెలిసిందే.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని