Special Status: రాజీనామా చేయాలనుకుంటే చేయండి: సజ్జల - telugu-news-sajjala ramakrishna fires on chandrababu
close
Published : 25/07/2021 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Special Status: రాజీనామా చేయాలనుకుంటే చేయండి: సజ్జల

అమరావతి: ప్రత్యేక హోదా కోసం తెదేపా అధినేత చంద్రబాబు తన ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామా చేయించాలనుకుంటే చేయించవచ్చని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రతి అంశంలో వైకాపా సభ్యుల రాజీనామాలు ఎందుకు డిమాండ్ చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉండగా ప్రత్యేక హోదా కోసం వైకాపా ఎంపీలు రాజీనామాలు చేసి వాటిని ఆమోదింపజేసుకున్నారని సజ్జల గుర్తు చేశారు. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో అప్పటి ప్రతిపక్షనేతగా జగన్ కూడా ఆందోళన చేశారని.. కలిసి రావాల్సిందిగా తెదేపాను ఎప్పుడూ డిమాండ్ చేయలేదన్నారు. వైకాపాకు సవాలు విసిరే బదులు చంద్రబాబు తన ఎంపీలతో రాజీనామా చేయించాలన్నారు. కోర్టులు ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశాన్ని ఏ కోణంలో చూశాయో తనకు తెలీదని.. అయితే అమరావతి అనేది ఓ కుంభకోణమని ప్రజలందరికీ తెలుసునని సజ్జల వ్యాఖ్యానించారు.

ఎంపీ రఘురామకృష్ణరాజు వెనుక చంద్రబాబు ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయమేనన్నారు. ఇరువురూ ప్రభుత్వంపై సమన్వయంతో కూడిన కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. రికార్డెడ్‌గా రఘురామ దొరికిపోయారన్నారు. ఈ కేసులో సీఐడీ దర్యాప్తు పారదర్శకంగా జరుగుతోందని సజ్జల స్పష్టం చేశారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని