Samantha: క్లోజ్‌ఫ్రెండ్‌తో సామ్‌.. దేహ్రాదూన్‌ టూర్‌ - telugu news samantha flys to dehradun with her bestie
close
Updated : 20/10/2021 12:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Samantha: క్లోజ్‌ఫ్రెండ్‌తో సామ్‌.. దేహ్రాదూన్‌ టూర్‌

హైదరాబాద్‌: ‘శాకుంతలం’ తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల అగ్రకథానాయిక సమంత సినిమాల నుంచి కొంత బ్రేక్‌ తీసుకున్న విషయం తెలిసిందే. పరస్పర అంగీకారంతో నాగచైతన్యతో వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పిన అనంతరం సామ్‌ సినిమాల్లో నటిస్తుందా? లేదా? అని అందరూ సందేహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తన కెరీర్‌పై నెటిజన్ల నుంచి వస్తోన్న ప్రశ్నలకు సమాధానమిస్తూ విజయదశమి రోజున తాను చేయనున్న తదుపరి ప్రాజెక్ట్‌లను ఆమె ప్రకటించారు. మరి కొన్నిరోజుల్లో వాటి రెగ్యులర్‌ షూట్‌ ప్రారంభం కానుంది. దీంతో, ఇప్పుడున్న ఖాళీ సమయాన్ని అన్నివిధాలుగా సద్వినియోగం చేసుకుంటున్నారు ఈ ముద్దుగుమ్మ. తనకెంతో ఇష్టమైన వారితో సమయాన్ని గడుపుతున్నారు.

తనకెంతో ఆప్తురాలైన శిల్పారెడ్డిని తాజాగా సామ్‌ కలిశారు. ఆమె కుటుంబసభ్యులతో సరదాగా గడిపారు. ‘టగ్‌ ఆఫ్‌ వార్‌’లో వీరు పోటాపోటీగా తలపడ్డారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలను వాళ్లిద్దరూ ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. అందం, సరదా, ఆనందంతో కూడిన క్షణాలతో వారం త్వరగా గడిచిపోయిందని పేర్కొన్నారు. అనంతరం మంగళవారం సాయంత్రం సామ్‌-శిల్పా విహారయాత్ర కోసం దేహ్రాదూన్‌కు వెళ్లారు. ఆ విషయాన్ని తెలియజేస్తూ.. ఫ్లైట్‌లో దిగిన ఫొటోలతోపాటు దేహ్రాదూన్‌ అటవీ ప్రాంతాల్లో ట్రెక్కింగ్‌ చేస్తోన్న ఫొటోలు షేర్‌ చేశారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని