BheemlaNayak:రానాకు జోడీగా? - telugu news samyukta menon may play lead role opposite rana in bheemlanayak
close
Published : 04/10/2021 11:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

BheemlaNayak:రానాకు జోడీగా?

మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పానుమ్‌ కోశియుమ్‌’ సినిమా తెలుగులో ‘భీమ్లా నాయక్‌’గా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. టైటిల్‌ పాత్రలో పవన్‌ కల్యాణ్‌ నటిస్తుండగా.. మరో హీరోగా రానా కనిపించనున్నారు. సాగర్‌ కె.చంద్ర దర్శకుడు. త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందిస్తున్నారు. సూర్యదేవర నాగవంశి నిర్మాత. ఈ సినిమాలో పవన్‌కు జోడీగా నిత్యామేనన్‌ను ఖరారు చేయగా.. రానా సరసన ఎవరు నటిస్తారన్నది ఇంత వరకు స్పష్టత రాలేదు. ఈ పాత్ర కోసం ఐశ్వర్య రాజేశ్‌ను సంప్రదిస్తున్నట్లు ఆ మధ్య వార్తలొచ్చినా.. అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇప్పుడీ అవకాశం మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మేనన్‌ను వరించినట్లు తెలిసింది. ఇదే నిజమైతే ఆమె తొలి తెలుగు చిత్రం అవుతుంది. ఈ సినిమాలో డేనియల్‌ శేఖర్‌గా రానా ఓ శక్తిమంతమైన పాత్రలో సందడి చేయనున్నారు. ఇది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: రవి కె.చంద్ర.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని