దేశం మర్చిపోలేని యోధుడు ఉదమ్‌సింగ్‌ - telugu news sardar udham trailer out now
close
Published : 01/10/2021 10:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దేశం మర్చిపోలేని యోధుడు ఉదమ్‌సింగ్‌

స్వాతంత్య్రోద్యమంలో ముఖ్య భూమిక పోషించిన సమరయోధుల్లో సర్దార్‌ ఉదమ్‌ సింగ్‌ పేరు చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పుడు ఆయన జీవిత కథతో తెరకెక్కిన చిత్రం ‘సర్దార్‌ ఉదమ్‌ సింగ్‌’. విక్కీ కౌశల్‌ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా ట్రైలర్‌ గురువారం విడుదలై ఆకట్టుకుంటోంది. జలియన్‌ వాలా బాగ్‌ మారణకాండకు కారణమైన జనరల్‌ డయ్యర్‌ను అందమొందించారు ఉదమ్‌సింగ్‌. డయ్యర్‌ను హతమార్చడానికి లండన్‌లో పడిన కష్టాలను ఈ చిత్రంలో చూపించనున్నట్టు ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. సూజిత్‌ సర్కార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 16న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘‘దేశం మర్చిపోలేని గొప్ప వ్యక్తి కథ ఇది. ఓ విప్లవవీరుడి కథ’’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు విక్కీ.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని