Mahesh Babu: మహేశ్‌ అభిమానులకు శుభవార్త - telugu news sarkaru vaari pata first notice starring mahesh babu
close
Updated : 29/07/2021 18:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Mahesh Babu: మహేశ్‌ అభిమానులకు శుభవార్త

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు మహేశ్‌ బాబు తన అభిమానులకి శుభవార్త వినిపించారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రం నుంచి ఓ సర్‌ప్రైజ్‌ అందిస్తున్నట్టు సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేశారు. మహేశ్‌ హీరోగా పరశురామ్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. కీర్తి సురేశ్‌ నాయిక. బ్యాంకు కుంభకోణాల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మహేశ్‌ ఇప్పటి వరకూ కనిపించని లుక్‌లో దర్శనమివ్వనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్‌ పోస్టర్‌ ఆకాశాన్నంటే అంచనాల్ని పెంచింది. దాంతో మహేశ్‌ ఫస్ట్‌లుక్‌ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘సర్కారు వారి పాట ఫస్ట్‌ నోటీస్‌.. జులై 31న’ అంటూ చిత్ర బృందం మరో ఫొటోని పంచుకుంది. ఇందులో మహేశ్‌ బ్యాగ్‌ పట్టుకుని కనిపించారు. మరి ఆ ఫస్ట్‌ నోటీస్‌ ఫస్ట్‌ లుక్కేనా? మరేదైనా ఆసక్తికర అప్‌డేటా అంటే శనివారం వరకు వేచి చూడాల్సిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 ప్లస్‌ రీల్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. లాక్‌డౌన్‌కి ముందు దుబాయ్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇటీవల పునః ప్రారంభమైంది.

 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని