Tollywood: ‘సర్కారు వారి’ పాట కబురు.. ‘రావణలంక’ని పరిచయం చేసిన విష్ణు - telugu news sarkaru vaari pata ravanalanka trailer mahesh babu
close
Published : 23/10/2021 01:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tollywood: ‘సర్కారు వారి’ పాట కబురు.. ‘రావణలంక’ని పరిచయం చేసిన విష్ణు

ఇంటర్నెట్‌ డెస్క్‌: మురళీ శర్మ, దేవ్‌గిల్‌, క్రిష్‌, అస్మిత, రచ్చ రవి తదితరులు కీలక పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘రావణలంక’. బీఎన్‌ఎస్‌ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ని నటుడు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు విడుదల చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. మిస్టరీ నేపథ్యంలో సాగే సన్నివేశాలతో ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. క్రిష్ బండిపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబరు 29న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: బీఎన్‌ఎస్‌ రాజు, సంగీతం: ఉజ్జల్‌.

పాటలు పూర్తయ్యాయి: తమన్‌

మహేశ్‌ బాబు హీరోగా పరశురామ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సర్కారువారి పాట’. కీర్తి సురేశ్‌ కథానాయిక. ఈ సినిమా మ్యూజిక్‌ కంపోజిషన్‌ పూర్తయినట్టు సంగీత దర్శకుడు తమన్‌ తెలిపారు. ఈ మేరకు ట్వీట్‌ చేస్తూ మహేశ్‌బాబుతో దిగిన ఫొటోని పంచుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రం 2022 సంక్రాంతికి సందడి చేయనుంది.

ఊటీ షెడ్యూల్‌ ముగిసింది: అక్షయ్‌

బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమర్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘రామ్‌సేతు’. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, చారిత్రక వారసత్వ సంపదకు సంబంధించిన కథతో అభిషేక్‌ శర్మ తెరకెక్కిస్తున్నారు. జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ కథానాయిక. టాలీవుడ్‌ నటుడు సత్యదేవ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఓ షెడ్యూల్‌ని ఊటీలో ముగించినట్టు అక్షయ్‌ సామాజిక మాధ్యమాల వేదికగా తెలిపారు. లొకేషన్‌లో దిగిన ఫొటోని షేర్‌ చేశారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని