‘సెహరి’ చిత్రీకరణ పూర్తయింది.. ‘గల్లీరౌడీ’ కొత్త పాటొచ్చింది - telugu news sehari shoot wrapped and new song promo released from gullyrowdy
close
Published : 19/07/2021 20:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘సెహరి’ చిత్రీకరణ పూర్తయింది.. ‘గల్లీరౌడీ’ కొత్త పాటొచ్చింది

ఇంటర్నెట్‌ డెస్క్‌: హ‌ర్ష్ క‌నుమిల్లి హీరోగా ద‌ర్శ‌కుడు జ్ఞానసాగ‌ర్ ద్వార‌క తెర‌కెక్కిస్తోన్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌  ‘సెహరి’. సిమ్ర‌న్ చౌద‌రి నాయిక‌. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయినట్టు సామాజిక మాధ్యమాల తెలియజేసింది చిత్రబృందం. మిగిలిన కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్‌ ట్రాక్‌, టీజర్‌ ప్రేక్షకుల్ని విశేషంగా అలరించాయి.

‘గల్లీరౌడీ’.. ఐటెం సాంగ్‌

సందీప్‌ కిషన్, బాబీ సింహా ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘గల్లీరౌడీ’. జి.నాగేశ్వర రెడ్డి దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘చాంగురే ఐటెమ్‌ సాంగ్‌రే’ అనే ప్రత్యేకగీతానికి సంబంధించి ప్రోమో వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. భాస్కరభట్ల రచించిన ఈ గీతాన్ని మంగ్లీ, సాయి కార్తీక్‌, దత్తు ఆలపించారు. సాయి కార్తీక్‌ స్వరాలు సమకూర్చారు. పూర్తి లిరికల్‌ వీడియోను ప్రముఖ నాయిక రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జులై 22న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో సందీప్‌ సరసన నేహా శెట్టి నటించింది. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా సంయుక్తంగా నిర్మించాయి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని