Shekar: ఉత్కంఠగా ‘శేఖర్‌’ టీజర్‌.. రాజశేఖర్‌ స్టైల్‌ అదిరింది - telugu news shekar teaser starring rajashekar
close
Published : 25/11/2021 17:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Shekar: ఉత్కంఠగా ‘శేఖర్‌’ టీజర్‌.. రాజశేఖర్‌ స్టైల్‌ అదిరింది

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాజశేఖర్‌ హీరోగా తెరకెక్కుతున్న థ్రిల్లర్‌ చిత్రం ‘శేఖర్‌’. ఆయన సతీమణి జీవిత రాజశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా టీజర్‌ విడుదలైంది. ఓ రిపోర్టర్‌ చదివిన నేర వార్తతో ప్రారంభమైన ఈ టీజర్‌ ఆద్యంతం ఉత్కంఠంగా సాగింది. ‘వాడెప్పుడైనా మనం చెప్పింది చేశాడా.. వాడు చేసేది మనకు చెప్పాడా’ అని కథానాయకుడి పాత్ర తీరు గురించి సాగిన సంభాషణ మెప్పిస్తుంది. రాజశేఖర్‌ పవర్‌ఫుల్‌ లుక్ ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రాన్ని బీరం సుధాకర్‌ రెడ్డి, శివాని రాజశేఖర్‌, శివాత్మిక రాజశేఖర్‌, బొగ్గారం వెంకట శ్రీనివాస్‌ నిర్మిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.

Read latest Cinema News and Telugu News




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని