Shershaah: కార్గిల్‌ వార్‌ హీరో కథ.. ట్రైలర్‌ వచ్చేసింది - telugu news shershaah trailer release starring sidharth malhotra kiara advani
close
Published : 26/07/2021 02:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Shershaah: కార్గిల్‌ వార్‌ హీరో కథ.. ట్రైలర్‌ వచ్చేసింది

ఇంటర్నెట్‌ డెస్క్‌: కార్గిల్‌ యుద్ధ వీరుడు లెఫ్టినెంట్‌ విక్రమ్‌ బాత్రా జీవితాధారంగా రూపొందిన హిందీ చిత్రం ‘షేర్షా’. సిద్దార్థ్‌ మల్హోత్రా, కియారా అడ్వాణీ ప్రధాన పాత్రలు పోషించారు. విష్ణు వర్ధన్‌ దర్శకత్వం వహించారు. ఆగస్టు 12 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ని విడుదల చేశారు దర్శకనిర్మాతలు. యుద్ధ సన్నివేశాలతో ఆద్యంతం ఉత్కంఠగా సాగింది ఈ ప్రచార చిత్రం. ఆనాటి పరిస్థితుల్ని కళ్లకి కట్టినట్టు చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. ‘షేర్షా’ (కోడ్‌ నేమ్‌) పాత్రలో సిద్దార్థ్‌ లుక్‌, నటన మెప్పిస్తున్నాయి. తన ప్రేమికురాలిగా కియారా ఒదిగిపోయింది. నాయకుడిగా ఇతరుల సైనికుల్లో స్ఫూర్తి రగిలించే సన్నివేశంలో సిద్దార్థ్‌ హావభావాలు రక్తి కట్టిస్తాయి. ఓ వైపు దేశభక్తి మరోవైపు ప్రేమ.. ఈ రెండింటిని విక్రమ్‌ ఎలా సమన్వయం చేశారనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్, క్యాష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని