Oscar 2022: ఆస్కార్‌ అవార్డ్స్‌.. తుది జాబితాలో నిలిచిన భారతీయ చిత్రాలివే..! - telugu news short listed movies for oscar 2022
close
Published : 22/10/2021 01:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Oscar 2022: ఆస్కార్‌ అవార్డ్స్‌.. తుది జాబితాలో నిలిచిన భారతీయ చిత్రాలివే..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆస్కార్‌.. యావత్‌ సినీ ప్రపంచం ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డ్స్‌. ఈ అవార్డుని అందుకోవాలని నటీనటులంతా కలలు కంటుంటారు. ఆ కలల్ని నెరవేర్చేందుకు ఏటా ఈ అవార్డుల ఉత్సవం జరుగుతుంటుంది. 2022గానూ ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీ’లో పోటీ పడేందుకు భారతీయ చలన చిత్ర పరిశ్రమ తరఫున అధికారిక ఎంట్రీ కోసం పలు సినిమాలు పోటీ పడుతున్నాయి. ఈ చిత్రాల్ని కోల్‌కతాలో ప్రదర్శిస్తున్నారు. వాటిల్లో 14 సినిమాలు తుది జాబితాలో నిలిచాయి. నాయట్టు (మలయాళం), మండేలా (తమిళం), షేర్నీ (హిందీ), సర్దార్‌ ఉద్దమ్‌ (హిందీ) తదితర చిత్రాలు షార్ట్‌ లిస్ట్‌లో ఉన్నాయి. జ్యూరీ సభ్యులు వీటిల్లోంచి ఓ చిత్రాన్ని భారతదేశం తరఫున ఆస్కార్‌కి నామినేట్‌ చేయనున్నారు. మరి వీటిలో ఏ చిత్రం నామినేట్‌ అవుతుందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. వచ్చే ఏడాది మార్చిలో ఈ అవార్డుల వేడుక జరగనుంది. అమెరికా ఇందుకు వేదికకానుంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని