Shyam Singha Roy: ‘శ్యామ్‌సింగ రాయ్‌’ ప్రేమగీతం.. వినసొంపుగా మిక్కీ సంగీతం - telugu news shyam singha roy second single edho edho
close
Published : 25/11/2021 18:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Shyam Singha Roy: ‘శ్యామ్‌సింగ రాయ్‌’ ప్రేమగీతం.. వినసొంపుగా మిక్కీ సంగీతం

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాని కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘శ్యామ్‌సింగ రాయ్‌’. రాహుల్‌ సాంక్రిత్యన్‌ దర్శకుడు. సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ కథానాయికలు. తాజాగా ఈ చిత్రంలోని రెండో పాట విడుదలైంది. ‘ఏదో ఏదో’ అంటూ సాగే ఈ ప్రేమగీతానికి మిక్కీ జె. మేయర్‌ అందించిన వినసొంపైన సంగీతం అలరించేలా ఉంది. కృష్ణకాంత్‌ కాంత్‌ రచించిన ఈ పాటను చైత్ర అంబడిపుడి ఆలపించారు. నాని ఈ సినిమాలో శ్యామ్‌సింగ రాయ్‌, వాసు అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. వాసు పాత్రకు సంబంధించిన గీతమిది. శ్యామ్‌సింగ రాయ్‌ పాత్రకు సంబంధించి ఇప్పటికే విడుదలైన (టైటిల్‌ సాంగ్‌) పాటకు శ్రోతల నుంచి విశేష స్పందన లభించింది. వెంకట్‌ ఎస్‌. బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకురానుంది.

Read latest Cinema News and Telugu News




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని