Mirabai Chanu: మీరాబాయి రజతం.. స్వర్ణంగా అప్‌గ్రేడ్‌ కానుందా? - telugu news silver medalist mirabai chanu could be awarded the gold medal
close
Published : 26/07/2021 14:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Mirabai Chanu: మీరాబాయి రజతం.. స్వర్ణంగా అప్‌గ్రేడ్‌ కానుందా?

చైనా అథ్లెట్‌కు డోప్‌ పరీక్షలు.. విఫలమైతే చానుకు పసిడి!

ఇంటర్నెట్‌ డెస్క్‌: మీరాబాయి చాను.. టోక్యో ఒలింపిక్స్‌లో భారత కీర్తిపతాకను రెపరెపలాడించిన అథ్లెట్‌. మహిళల వెయిట్‌ లిఫ్టింగ్‌ 49 కిలోల పోటీల్లో ఆమె రజత పతకం సాధించి చరిత్ర సృష్టించింది. కరణం మల్లీశ్వరి తర్వాత దేశానికి పతకం అందించింది. అనూహ్య పరిణామాలు జరిగితే ఆమె పతకం వెండి నుంచి బంగారానికి అప్‌గ్రేడ్‌ కానుంది!

49 కిలోల పోటీల్లో చైనా క్రీడాకారిణి హు జిహుయి 210 కిలోలు ఎత్తి పసిడి పతకం కైవసం చేసుకుంది. స్నాచ్‌లో 94 కిలోలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 116 కిలోలు ఎత్తి ఘన విజయం సాధించింది. మీరాబాయి స్నాచ్‌లో 87కి, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 115కి.. మొత్తంగా 202 కిలోలు ఎత్తి రజతం ముద్దాడింది.

కొన్ని కారణాల వల్ల హు జిహూయిని నిర్వాహకులు ఒలింపిక్‌ గ్రామంలోనే ఉండాల్సిందిగా ఆదేశించారు. ఆమెకు మరోసారి డోప్‌ పరీక్షలు చేయనున్నారని తెలిసింది. ఒకవేళ ఆ పరీక్షల్లో ఆమె విఫలమైతే మీరాబాయి రజతాన్ని స్వర్ణానికి ఉన్నతీకరిస్తారు. కానీ.. ఈ అంశంపై మరింత సమాచారం, స్పష్టత రావాల్సి ఉంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని