RRR: సినీ ప్రియులారా సిద్ధం కండి.. ‘దోస్తులు’ వచ్చేస్తున్నారు..! - telugu news singers vijay yesudas and yazin nizar about rrr song
close
Updated : 31/07/2021 15:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RRR: సినీ ప్రియులారా సిద్ధం కండి.. ‘దోస్తులు’ వచ్చేస్తున్నారు..!

హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఎంతో ఆతృతతో ఎదురుచూస్తోన్న ప్రాజెక్ట్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా తెరకెక్కుతోన్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌కు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడెక్షన్‌ పనులకు చేరువలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రమోషన్స్‌ని చిత్రబృందం భారీగా ప్లాన్‌ చేసింది. ఇందులో భాగంగా దేశంలోనే పేరుపొందిన ఐదుగురు యువ సంగీత కెరటాలతో స్నేహగీతాన్ని క్రియేట్‌ చేయించింది.

‘దోస్తీ’ అంటూ సాగే ఈ పాటను స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం (ఆగస్టు 1) చిత్రబృందం విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ‘దోస్తీ’ పాటను ఆలపించిన హేమచంద్ర, అనిరుధ్‌, అమిత్‌ త్రివేది ఇప్పటికే తమ అభిప్రాయాలను పంచు.. తాజాగా విజయ్‌ ఏసుదాస్‌, యాజిన్‌ నైజర్‌ సైతం కీరవాణితో కలిసి పనిచేయడం గురించి స్పందించారు.

‘లెజండరీ కీరవాణి సంగీత సారథ్యంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం పాట పాడటం ఎంతో ఆనందంగా ఉంది. మునుపెన్నడూ లేనివిధంగా వివిధ భాషలకు చెందిన గాయకులమైన మేమంతా కలిసి పాన్‌ఇండియా ప్రాజెక్ట్‌ కోసం ‘దోస్తీ’ పాట ఆలపించాం. ‘దోస్తీ’ సాంగ్‌లో భాగమైనందుకు ఆనందిస్తున్నాను’ అని యాజిన్‌ నైజర్‌ తెలిపారు. మరోవైపు విజయ్‌ ఏసుదాస్‌ సైతం ‘దోస్తీ’లో భాగమైనందుకు సంతోషం వ్యక్తం చేశారు. ప్రమోషనల్‌ సాంగ్‌ చిత్రీకరణ చాలా అద్భుతంగా జరిగిందని.. ఇలాంటి ప్రమోషనల్‌ సాంగ్‌ షూట్‌ ఎన్నడూ చూసి ఉండరని ఆయన అన్నారు.





మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని