Social Look: రకుల్‌ కామెడీ సిరీస్‌.. భూమిక ఫొటోషూట్‌ జ్ఞాపకాలు - telugu news social look of tollywood kollywood bollywood actors
close
Published : 06/08/2021 01:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: రకుల్‌ కామెడీ సిరీస్‌.. భూమిక ఫొటోషూట్‌ జ్ఞాపకాలు

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్: ‘పొట్ట చెక్కలయ్యే వరకు నవ్వండి’ అంటూ నవ్వుతున్న తన ఫొటోని పంచుకుంది నాయిక రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. కామెడీ ప్రధానంగా తాను నటించిన ఓ వెబ్‌ సిరీస్‌ త్వరలోనే రాబోతుందని తెలిపింది.

* ‘హీటెక్కించే వేసవి.. చల్లని పానీయం’ అని పోస్ట్‌ చేసింది ప్రియాంక చోప్రా. ప్రస్తుతం ఆమె లండన్‌లో ఉంది.

* యువ నాయిక ప్రియాంక జవాల్కర్‌ నటించిన ‘ఎస్‌.ఆర్‌. కల్యాణమండపం’ చిత్రం శుక్రవారం విడుదలవుతుంది. ఈ సందర్భంగా షూటింగ్‌కి సంబంధించిన కొన్ని ఫొటోలు షేర్‌ చేస్తూ తనకి అవకాశం ఇచ్చిన చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలియజేసింది.

* సముద్ర తీరంలో ఉయ్యాల ఊగుతూ కనిపించింది నటి వేదిక. ‘సీ సోల్‌’ అంటూ కొన్ని ఫొటోలు షేర్‌ చేసింది.

* పదేళ్లనాటి ఫొటోషూట్‌ని గుర్తు చేసుకుంది భూమిక. ఫొటోగ్రాఫర్‌ చెప్పినట్టు హావభావాలు పలికించేందుకు నా వంతు ప్రయత్నం చేశాను అని చెప్పుకొచ్చింది.
































మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని