Social Look: వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌గా సదా.. సింగింగ్‌తో భయపెట్టిన జెనీలియా! - telugu news social look of tollywood kollywood bollywood actors
close
Published : 29/10/2021 02:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌గా సదా.. సింగింగ్‌తో భయపెట్టిన జెనీలియా!

Social Look: సినిమా తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలివీ..

* తాను నటించిన ‘మంచి రోజులు వచ్చాయి’ చిత్ర ప్రచారంలో భాగంగా దిగిన ఫొటోని షేర్‌ చేసింది మెహ్రీన్‌. పసుపు రంగు దుస్తుల్లో అందరినీ ఆకట్టుకునేలా ఉంది.

* ‘పన్నా టైగర్‌ రిజర్వు’లో సదా సందడి చేసింది. వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రఫీలో మంచి అనుభవం ఉన్న వ్యక్తులతో కలిసి అక్కడి దృశ్యాల్ని కెమెరాలో బంధించింది. ‘నా జీవితంలో ఇదొక కొత్త అధ్యాయం. ఇలాంటి వ్యక్తుల్ని కలవడం ఆనందంగా ఉంది’ అని రాసుకొచ్చింది.

* వ్యాయామం అనంతరం తాను తీసుకున్న సెల్ఫీలను పంచుకుంది శ్రద్ధాదాస్‌. ‘మిమ్మల్ని మీరు ప్రేమించండి’ అనే వ్యాఖ్యని జతచేసింది.

* తన బెస్ట్‌ ఫ్రెండ్‌ని చాలా రోజుల తర్వాత కలిసిందట ప్రగ్యా జైస్వాల్‌. ఆమెతో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.

* పాట పాడుతూ జిమ్‌లో ఉన్న వ్యక్తుల్ని భయపెట్టింది జెనీలియా. ‘మీకు నచ్చిన పాట మీ ఇయర్‌ఫోన్స్‌లో ప్లే అయితే ఇలానే ఉంటుంది’ అంటూ సరదా వీడియోను పోస్ట్‌ చేసింది.

* యూట్యూబర్‌, ‘బిగ్‌బాస్‌’ ఫేం అరియానా ప్రముఖ నటుడు తనికెళ్ల భరణిని కలిసింది. ‘నా ఫేవరెట్‌ ఫొటో’ అంటూ ఆయనతో కలిసి దిగిన ఫొటోని పంచుకుంది. ఇంకా ఎవరెవరు ఏఏ సంగతులు పంచుకున్నారో ఓ లుక్కేయండి..

























Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని