Tokyo Olympics: సౌరభ్‌ షూటింగ్‌ అదుర్స్‌.. ఫైనల్‌కు దూసుకెళ్లిన యువ కెరటం - telugu news sourabh choudhary storms into final
close
Published : 24/07/2021 11:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tokyo Olympics: సౌరభ్‌ షూటింగ్‌ అదుర్స్‌.. ఫైనల్‌కు దూసుకెళ్లిన యువ కెరటం

టోక్యో: భారత యువ షూటర్‌ సౌరభ్‌ చౌదరి దుమ్మురేపాడు. 10మీటర్ల పురుషుల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. మొత్తం 36 మంది పోటీపడగా 586-28Xతో అగ్రస్థానంలో నిలిచాడు. అతడి సహచరుడు అభిషేక్‌ వర్మ 575-19Xతో 17వ స్థానానికి పరిమితమయ్యాడు. సౌరభ్ ఆరు సిరీసుల్లో వరుసగా 95, 98, 98, 100, 98, 97 పాయింట్లు సాధించడం గమనార్హం. మధ్యాహ్నం అతడు పతకం సాధిస్తాడో లేదో చూడాలి.

ఇక టేబుల్‌ టెన్నిస్‌లో భారత్‌కు నిరాశే ఎదురైంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో శరత్‌ కమల్‌, మనికా బాత్రా జోడీ ఓటమి పాలైంది. మూడో సీడ్‌, చైనీస్‌ తైపీకి చెందిన లిన్‌ యున్‌ జు, చెంగ్‌ ఐ చింగ్‌ చేతిలో 11-8, 11-6, 11-5, 11-4 తేడాతో ఓడిపోయారు. ఇక వీరు వ్యక్తిగత, మహిళలు, పురుషుల విభాగాల్లో అదృష్టం పరీక్షించుకోనున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని