Chiranjeevi: నేను మరిచిపోలేని రోజు..! - telugu news special day for chiranjeevi
close
Published : 22/09/2021 15:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Chiranjeevi: నేను మరిచిపోలేని రోజు..!

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు చిరంజీవికి ఈ రోజు (సెప్టెంబరు 22) ఎంతో ప్రత్యేకమైంది. ఎందుకంటే కొణిదెల శివశంకర్‌ వరప్రసాద్‌ అనే వ్యక్తిని చిరంజీవిగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేసింది ఈ రోజే. సామాజిక మాధ్యమాల వేదికగా ఇదే విషయాన్ని చెప్తూ, తనపై ఇంతటి ఆదరాభిమానాలు చూపిస్తోన్న అభిమానులకి చిరంజీవి ధన్యవాదాలు తెలియజేశారు. ‘ఆగస్టు 22 నేను పుట్టిన రోజైతే, సెప్టెంబరు 22.. నటుడిగా పుట్టినరోజు. కళామ్మతల్లి నన్ను అక్కున చేర్చుకున్న రోజు. నటుడిగా పరిచయమై మీ అందరి ఆశీస్సులు పొందినరోజు. నేను మరిచిపోలేనిరోజు. దీనికి కారణమైన నా సోదరసోదరీమణులకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. చిరంజీవి నటించిన తొలి చిత్రం ‘పునాది రాళ్లు’ అయినా ముందుగా ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో ప్రేక్షకులకి పరిచయం అయ్యారు. 1978 సెప్టెంబరు 22న ఈ సినిమా విడుదలైంది. ప్రస్తుతం ఆయన ‘ఆచార్య’ చిత్రంతో బిజీగా ఉన్నారు. మోహన్‌ రాజా దర్శకత్వంలో ‘గాడ్‌ ఫాదర్‌’, మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ చిత్రాల్లో నటిస్తున్నారు. కె.ఎస్‌. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఓ చిత్రం ప్రకటించారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని