Pawan Kalyan: పవన్‌-సురేందర్‌రెడ్డి మూవీ.. లేటెస్ట్‌ అప్‌డేట్‌ ఇదే! - telugu news special update from pspk29 team
close
Updated : 02/09/2021 14:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Pawan Kalyan: పవన్‌-సురేందర్‌రెడ్డి మూవీ.. లేటెస్ట్‌ అప్‌డేట్‌ ఇదే!

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్‌ కోసం దర్శకులు వేచి చూస్తున్నారు. ఇప్పటికే నాలుగు సినిమాలను ప్రకటించగా, రెండు సెట్స్‌పై ఉన్నాయి. ఈ నాలుగింటిలో డైరెక్టర్‌ సురేందర్‌రెడ్డి చిత్రం ఒకటి. గతేడాది ఈ సినిమాకు సంబంధించి ప్రకటన చేశారు. అయితే, కరోనా పరిస్థితులు, పవన్‌ వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ఆ తర్వాత దీనికి ఎలాంటి సమాచారం లేదు. గురువారం పవన్‌ పుట్టిన రోజు సందర్భంగా తాజా చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఒక వైపు హైదరాబాద్‌ నగరం.. మరోవైపు తుపాకీతో ఉన్న పోస్టర్‌ మధ్యలో ‘యథా కాలమ్‌.. తథా వ్యవహారమ్‌..’ అంటూ రాసుకొచ్చారు. కాన్సెప్ట్‌ చూస్తుంటే సమకాలనీ అంశాలకు యాక్షన్‌ జోడించి సురేందర్‌రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు. ‘భీమ్లానాయక్‌’, ‘హరిహర వీరమల్లు’, హరీశ్‌ శంకర్‌ మూవీ పూర్తయిన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కనుంది. మరోవైపు సురేందర్‌రెడ్డి అఖిల్‌తో ‘ఏజెంట్‌’ మూవీ చేస్తున్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని