పాత రోజుల్లోకి తీసుకెళ్లిన సదా - telugu news sridevi drama company sudheer aadi sada indraja
close
Published : 18/07/2021 21:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాత రోజుల్లోకి తీసుకెళ్లిన సదా

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘రానురానంటూనే చిన్నదో’ అంటూ జయం సినిమాలో సదా చేసిన అల్లరి గుర్తుందిగా..! దాదాపు ఇరవయేళ్ల తర్వాత మళ్లీ ఓసారి పాత రోజుల్లోకి తీసుకెళ్లిందామె. ‘ఈటీవీ’లో ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో భాగంగా రాబోయే ఎపిసోడ్‌లో ఆమె సందడి చేయనుంది. తాజాగా ఆ ఎపిసోడ్‌ ప్రోమో విడుదలైంది. తనకు ఎంతో గుర్తింపు తెచ్చిన పాటకు సదా మళ్లీ ఓసారి స్టెప్పులేసింది. మరోనటి ఇంద్రజ గాయని అవతారం ఎత్తింది. ‘లాలి.. లాలి’ అంటూ పాట పాడి అందర్నీ ఆకట్టుకుంది. వరుణ్‌ సందేశ్‌ హీరోగా నటించిన ‘ఇందువదన’ చిత్రబృందం కూడా పాల్గొని సందడి చేసింది. ఎప్పటిలాగే రామ్‌ప్రసాద్‌, ఆది తమదైన స్టైల్‌లో పంచ్‌లు వేసి కడుపుబ్బా నవ్వించారు. భాను, వర్ష, ఇమ్మాన్యుయెల్‌ తమ డ్యాన్స్‌ పెర్ఫార్మెన్సుతో అదరగొట్టారు. ఈపూర్తి ఎపిసోడ్‌ జూలై 25న మధ్యాహ్నం 1 గంటకు ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. చూసి ఆనందించండి..
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని