AsalemJarigindi: అందరికీ నచ్చేలా అసలేం జరిగిందంటే...? - telugu news sriram Starer AsalemJarigindi movie will release on friday
close
Updated : 22/10/2021 07:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AsalemJarigindi: అందరికీ నచ్చేలా అసలేం జరిగిందంటే...?

‘‘రొమాన్స్‌.. ప్రేమ.. ఫిక్షన్‌.. అన్నీ కలగలిసి ఉన్న సినిమా ఈ ‘అసలేం జరిగింది’’ అన్నారు నటుడు శ్రీరామ్‌. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ఎన్‌వీఆర్‌ తెరకెక్కించారు. మైనేని నీలిమా చౌదరి, కొయ్యాడ కింగ్‌ జాన్సన్‌ సంయుక్తంగా నిర్మించారు. సంచితా పదుకొనే కథానాయిక. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ  సందర్భంగా శ్రీరామ్‌ విలేకర్లతో మాట్లాడుతూ.. ‘‘గ్రామీణ నేపథ్యంలో సాగే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ లవ్‌స్టోరీ ఇది. యాక్షన్‌కు ప్రాధాన్యముంది. సినిమా చాలా ఆహ్లాదకరంగా.. అందరికీ నచ్చేలా ఉంటుంది. దర్శకుడు కథ చెప్పినప్పుడే.. స్క్రిప్ట్‌తో ప్రేమలో పడిపోయా. ఈ చిత్రం కోసం తొలిసారి తెలంగాణ యాసలో సంభాషణలు పలికా. అది మర్చిపోలేని అనుభూతినిచ్చింది. ఎక్కువ శాతం తెలంగాణ పల్లెల్లోనే చిత్రీకరణ జరగడం వల్ల.. ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని ప్రాంతాలు చూసే అవకాశం దొరికింది. సంచితా సినిమాలకు కొత్తే అయినా చాలా కష్టపడి పనిచేసింది. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూసి తీరాల్సిన చిత్రమిది. నిజాయితీగా చేసిన మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని నమ్ముతున్నా’’ అన్నారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని