సునీల్‌-ధన్‌రాజ్‌ కాంబినేషన్‌.. ఆసక్తి పెంచుతోన్న టైటిల్‌ - telugu news sunil and dhanraj combo title poster released
close
Published : 01/08/2021 13:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సునీల్‌-ధన్‌రాజ్‌ కాంబినేషన్‌.. ఆసక్తి పెంచుతోన్న టైటిల్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: సునీల్‌, ధన్‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో ఓ చిత్రం రూపొందుతోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ అంజి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. టైటిల్‌ పోస్టర్‌ని ఆదివారం విడుదల చేసింది చిత్ర బృందం. సైకలాజికల్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘బుజ్జీ ఇలారా’ అనే ఆసక్తికర పేరుని ఖరారు చేశారు. ఈ సినిమాలో చాందిని తమిళరసన్‌ నాయికగా నటిస్తుంది. పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సత్యకృష్ణ, వేణు, భూపాల్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి ఈ చిత్రానికి కథ, స్క్కీన్‌ ప్లే అందిస్తున్నారు. జి. నాగేశ్వర రెడ్డి టీమ్‌ వర్క్స్‌, ఎస్‌.ఎన్‌.ఎస్‌. క్రియేషన్స్‌ ఎల్‌.ఎల్‌.పి. సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి సంగీతం: సాయి కార్తీక్‌, ఛాయాగ్రహణం: అంజి, మాటలు: భాను, నాయుడు, కూర్పు: చోటా కె. ప్రసాద్‌, కళ: చిన్నా. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని