Talasani Srinivas: అలా అనడం ఈటల అహంకారానికి నిదర్శనం: తలసాని - telugu-news-talasani srinivas fires on eatala rajender
close
Updated : 12/08/2021 16:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Talasani Srinivas: అలా అనడం ఈటల అహంకారానికి నిదర్శనం: తలసాని

హైదరాబాద్: భాజపా నేత ఈటల రాజేందర్‌కు హుజూరాబాద్ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నాగార్జున సాగర్‌లో జానారెడ్డికి పట్టిన గతే.. ఉప ఎన్నికలో ఈటలకు పడుతుందన్నారు. హైదరాబాద్‌లో తలసాని మీడియాతో మాట్లాడారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను బానిసగా పేర్కొనడం.. ఈటల అహంకారానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈటల ముందు గెల్లు శ్రీనివాస్ యాదవ్ చిన్న పిల్లవాడు కావచ్చు కానీ.. మొదట పోటీ చేసినప్పుడు ఈటల కూడా దామోదర్ రెడ్డి ముందు చిన్నవాడేనని గర్తుపెట్టుకోవాలని సూచించారు. ఈటల హుజూరాబాద్‌లో బీసీ.. శామీర్‌పేటలో ఓసీ అని ఎద్దేవా చేశారు. ఉద్యమకారులకు తెరాస మొదటి నుంచి ప్రాధాన్యత ఇస్తోందని.. గతంలో బాల్క సుమన్, కిశోర్ తదితరులకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఇప్పుడు గెల్లు శ్రీనివాస్‌కు కూడా అదే విధంగా సీఎం కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారన్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని