TS News: మంత్రి తలసానిని సత్కరించినటీఎఫ్‌సీసీ - telugu news telangana film chamber of commerce members and exhibitors met yadav talasani
close
Published : 23/07/2021 15:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS News: మంత్రి తలసానిని సత్కరించినటీఎఫ్‌సీసీ

హైదరాబాద్‌: తమ సమస్యలకు పరిష్కారం చూపాలంటూ ఎగ్జిబిటర్లు తెలంగాణ థియేటర్ల యాజమాన్యాలు గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించిన సంగతి తెలిసిందే. వాటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం  గతంలో జారీ చేసిన జీవో నెం.63ను సవరిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లకు పార్కింగ్‌ ఫీజులు వసూలు చేసేందుకు వీలు కల్పించింది. దీనిపై హర్షం వ్యక్తం చేసిన తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ సభ్యులు, ఎగ్జిబిటర్లు, థియేటర్ల యజమానులు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ని శుక్రవారం కలిశారు.  తమ సమస్యలకి పరిష్కారం చూపినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసి, సత్కరించారు. గతంలో ‘సేవ్‌ సినిమా- సేవ్‌ థియేటర్‌’ నినాదంతో పార్కింగ్‌ ఫీజు వసూలు, నామమాత్రపు విద్యుత్తు బిల్లులు, ప్రాపర్టీ ట్యాక్స్‌, జీఎస్టీ తదితర విషయాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని