The Family Man Season 2: ‘ఫ్యామిలీ మ్యాన్‌’ అభిమానులకు శుభవార్త  - telugu news the family man season 2 available in telugu tamil samantha
close
Published : 26/08/2021 01:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

The Family Man Season 2: ‘ఫ్యామిలీ మ్యాన్‌’ అభిమానులకు శుభవార్త 

ఇంటర్నెట్‌ డెస్క్‌: విశేష ప్రేక్షకాదరణ పొందిన వెబ్‌ సిరీస్‌ల్లో ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ ఒకటి. మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రియమణి తదితరులు కీలక పాత్రధారులుగా రాజ్‌ అండ్‌ డీకే తెరకెక్కించారు. 2019లో ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదలైన సీజన్‌-1 ఘన విజయం అందుకుంది. దాంతో సీజన్‌-2పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పైగా ప్రముఖ కథానాయిక సమంత కీలక పాత్ర పోషించడంతో అంచనాలు ఆకాశన్నంటాయి.

ఆ అంచనాలకు తెరదించుతూ 2021 జూన్‌ 3న సీజన్‌-2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తెలుగు, తమిళ ప్రేక్షకులకి కాస్త నిరాశ కలిగిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ సిరీస్‌ కేవలం హిందీలోనే విడుదలైంది. మన భాషలో ఎప్పుడెప్పుడు చూడాలా? అని ఆసక్తిగా ఎదురుచూసిన వారికి ‘ఫ్యామిలీ మ్యాన్‌’ బృందం తాజాగా శుభవార్త వినిపించింది. తెలుగు, తమిళ, ఇంగ్లిష్‌ డబ్బింగ్‌ వెర్షన్‌ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ప్రకటించింది. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం ఓటీటీలో ఓ లుక్కేయండి..



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని