India vs Srilanka: ఇంతకీ ఆ చీటీలో రాహుల్‌ ద్రవిడ్‌ ఏం రాశాడు? - telugu news the reason why rahul dravid sent a 12th man on the park with a chit during second t20i
close
Published : 29/07/2021 15:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

India vs Srilanka: ఇంతకీ ఆ చీటీలో రాహుల్‌ ద్రవిడ్‌ ఏం రాశాడు?

ఇంటర్నెట్‌ డెస్క్‌: శ్రీలంకతో రెండో టీ20లో టీమ్‌ఇండియా పోరాడి ఓడింది. జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నప్పటికీ ఆఖరి వరకూ విజయం కోసం కృషి చేసింది. లంక ఛేదనలో 18వ ఓవర్లో వర్షం కురవడం ఉత్కంఠ రేపింది. అదే సమయంలో ద్రవిడ్‌ 12వ ఆటగాడితో ఒక చీటీ పంపించడం ఆసక్తి కలిగించింది. ఇంతకీ అందులోని రహస్యం ఏంటి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు!

ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 5 వికెట్ల నష్టానికి 132 పరుగులే చేసింది. శిఖర్‌ ధావన్‌ (40; 42 బంతుల్లో 5×4) టాప్‌ స్కోరర్‌. దేవదత్‌ పడిక్కల్‌ (29; 23 బంతుల్లో 1×4, 1×6), రుతురాజ్‌ గైక్వాడ్‌ (21; 18 బంతుల్లో 1×4) అతడికి తోడుగా నిలిచారు. మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. లంక ఛేదన సైతం ఆసక్తికరంగానే సాగింది. ధనంజయ డిసిల్వా (40*) అజేయంగా నిలిచి విజయం అందిచాడు. మినోద్‌ భనుక (36) ఫర్వాలేదనిపించాడు.

లంక ఇన్నింగ్స్‌ 18వ ఓవర్లో వర్షం అంతరాయం కలిగించింది. అప్పుడు ఆ జట్టు స్కోరు 113/6. జల్లులు మొదలవ్వగానే అంపైర్లు బెయిల్స్‌ తీసేశారు. వరుణుడు త్వరగానే వెనుదిరగడంతో ఎలాంటి ఓవర్ల కోత లేకుండా మ్యాచ్‌ తిరిగి ఆరంభమైంది. ఆ స్వల్ప విరామంలోనే టీమ్‌ఇండియా 12వ ఆటగాడైన సందీప్‌ వారియర్‌ చేతిలో ఒక చీటీతో పరుగెత్తుకెళ్లాడు. దానిని కోచ్‌ ద్రవిడ్‌ అతడికి ఇచ్చాడు. అందులో ఏముందని అందరికీ ఆసక్తి కలిగింది. అప్పటికి డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం లంక 3 పరుగుల లోటుతో ఉంది. అదే విషయాన్ని ద్రవిడ్‌ రాసుంటాడని అంటున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని