KTR: తెలంగాణలో జూట్‌ పరిశ్రమలు.. ముందుకొచ్చిన మూడు సంస్థలు - telugu news three companies to establish jute industries in telangana
close
Updated : 17/09/2021 14:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

KTR: తెలంగాణలో జూట్‌ పరిశ్రమలు.. ముందుకొచ్చిన మూడు సంస్థలు

హైదరాబాద్: తెలంగాణలో జూట్ పరిశ్రమలు నెలకొల్పేందుకు మూడు పరిశ్రమలు ముందుకొచ్చాయని.. తద్వారా రాష్ట్రానికి రూ.887 కోట్ల పెట్టుబడులు, 10,400 ఉద్యోగాలు రానున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. వరంగల్, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో నెలకొల్పనున్న గ్లోస్టర్, ఎంజీబీ, కాళేశ్వరం ఆగ్రో మిల్లుల యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో జరిగిన అవగాహన కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్ తో పాటు కంపెనీల ప్రతినిథులు పాల్గొన్నారు. ఇప్పటివరకు తెలంగాణలో జూట్ మిల్లులు లేవని కేటీఆర్ అన్నారు. జనపనార రంగంలోనూ ప్రగతి సాధించేందుకు.. తద్వారా ఇక్కడ గన్నీ బ్యాగులు, జూట్ ఉత్పత్తుల అవసరాలను ఈ పరిశ్రమలు తీర్చగలుగుతాయని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో మొదటగా జూట్ మిల్లుల ఏర్పాటుకు ముందుకొచ్చిన యాజమాన్యాలకు రవాణా రాయితీలతో పాటు వారి ఉత్పత్తులను 20 ఏళ్లపాటు ప్రభుత్వమే కొనే విధంగా ఒప్పందాన్ని చేసుకున్నట్లు ప్రకటించారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా వాడే జూట్ వల్ల పర్యావరణ హిత జీవనవిధానం సైతం సాకారం అవుతుందని కేటీఆర్ అన్నారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని